సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర పంచారామ క్షేత్రం, భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసం రెండో సోమవారం ఆలయమునకు తెల్లవారు జాము 3న్నర నుండి భక్తులు విశేషంగా వచ్చారు. దేవాలయ ధర్మ కర్తల మండలి సభ్యులు మరియు చైర్మెన్ చింతలపాటి బంగారు రాజు, భక్తులకు ఏర్పాట్లను సమీక్షించారు.నేటి ఉదయం, మండలి చైర్మెన్ మోషేనురాజు, ఎమ్మెల్యే అంజిబాబు ఆలయ మర్యాదలతో స్వామివారిని దర్శించుకొన్నారు. నేటి సాయంత్రం వరకు సుమారుగా 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా దర్శనముల టికెట్స్ ద్వారా 2,79,900/-రూపాయలు ప్రసాదం విక్రయం ద్వారా 20వేల రూపాయలు, మొత్తం 2,99,900/-లు .మరియు శ్రీ స్వామి వారి నిత్య అన్నదానం నందు కానుకల వలన రూ 1,22,817 /-రూపాయలు లభించాయని దేవాలయ కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
