సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: రష్యన్ సోషలిస్టు విప్లవం 105 వ వార్షికోత్సవాన్ని సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.వారి కార్యాలయంలో కమ్యూనిస్టు ఉద్యమ పితామహులు కారల్ మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రపంచంలో పెట్టుబడి దారుల దోపిడీ అంతానికి శ్రమజీవుల రాజ్యానికి బాటలు వేసిన మహత్తర విప్లవం 1917 రష్యన్ సోషలిస్టు విప్లవమని, రష్యాలో లెనిన్ మహాశయుడు కార్మికులను, రైతులను ఏకం చేసి సోషలిస్టు సమాజ స్థాపన దిశగా విప్లవోద్యమం నిర్మించి రష్యన్ జార్ చక్రవర్తుల నిరంకుశ, దోపిడీ పాలన అంతమెందించి సోషలిస్టు సమాజాన్ని నెలకొల్పి శ్రమజీవుల రాజ్యానికి బాటలు వేశారన్నారు.ఈ విప్లవ స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా భారత్ తో సహా అనేక దేశాల్లో కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీలు ఆవిర్భావించాయన్నారు..ఈ కార్యక్రమం లో సీపీఐ భీమవరం పట్టణ కార్యదర్శి సిహెచ్ రంగారావు, సీపీఐ భీమవరం మండల కార్యదర్శి ఎం.సీతారాం ప్రసాద్, మహిళా సమాఖ్య పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, సీపీఐ జిల్లా సమితి సభ్యులు మల్లుల శ్రీనివాస్, యేలేటి విజయా తదితరులు పాల్గొన్నారు.
