సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జె.ఎన్.టి.యు.కె. యూనివర్సిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించబోనున్న సౌత్ జోన్ ఆటలపోటీల కొరకు వివిధ ఆటల్లో ఎంపిక పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ ఎంపిక పోటీల్లో ఎంపికైన విద్యార్థులు సౌత్ జోన్ ఆటల పోటీల్లో పాల్గొనుటకు అర్హులు. ఇందునిమిత్తం జరిగిన ఎంపిక పోటీల్లో శ్రీ విష్ణు ఇంజినీరింగ్ మహిళా కళాశాల తరఫున పాల్గొన్న విద్యార్థినీ ఆర్.సి. లాస్య (ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం) – రైఫిల్ షూటింగ్ (ఎయిర్ పిస్టల్) లో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ ను సాధించింది. శ్యామల గౌరీ (ఇంజినీరింగ్ చివరి సంవత్సరం) – బాడ్మింటన్ లో మొదటి స్థానం సాధించింది.జి. హనీష్మా (ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం) – నెట్ బాల్ లో అర్హతను సాధించి, సౌత్ జోన్ పోటీలకు ఎంపిక అయ్యింది.వీరు సౌత్ జోన్ ఆటల పోటీల్లో పాల్గొనుటకు అర్హతను సాధించడం జరిగిందని నేడు, బుధవారం ఉదయం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. వెంకటరామ రాజు తెలియజేసారు.
