సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సౌదీ అరేబియాలో బదర్-మదీనాల మధ్య నేటి సోమవారం తెల్లవారు జామున 1.30 గంటల ప్రాంతంలో ముఫరహత్ దగ్గర బస్సు – ట్యాంకర్ ఢీకొట్టుకున్న సంఘటనలో ఏకంగా 42 మంది చనిపోయారు. మృతుల్లో 20 మంది మహిళలు కాగా.. 11 మంది చిన్నారులు ఉన్నారు. వీరంతా పవిత్ర మక్కా ను దర్శించుకొని మదీనా వెళ్తున్న భారతీయ యాత్రికులు కావటం గమనార్హం. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నారు అని సమాచారం. సౌదీ సహాయక బృందాలు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ వారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించాయి. ఇండియన్ ఎంబసీ ఈ ఘటనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
