సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్‌లో జరిగిన ‘స్కంద’ సినిమా థండర్ వేడుకలో బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రామ్ పోతినేని కథానాయకుడిగా అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. శ్రీలీల , నయి మంజేరేకర్ నాయకలు.. మరి స్కంద సినిమా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ థండర్ వేడుకలో చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఈవేడుకల్ బాబాయ్ బాలకృష్ణ మొన్న, నిన్న, నేటి యువతరం తో కూడా జై బాలయ్య అనిపిస్తున్నాడంటే ఇటివంటి హీరో ప్రపంచంలో ఎవరు ఉండరేమో? అంటూ హీరో రామ్ ప్రశంసించారు. ఇక బాలయ్య మాట్లాడుతూ.. ఈ రోజుల్లో సినిమా అంటే ఎలా ఉండాలి.. ప్రేక్షకుల్ని ఎలా థియేటర్లకు రప్పించాలి అన్న విషయంపై దర్శక నిర్మాతలు దృష్టి పెట్టాలి. రామ్ తెలంగాణ నేపథ్యంలో ‘ఇస్మార్ట్ శంకర్’ చేసి నాకొక సవాల్ విసిరాడు. విభిన్న నేపథ్యమున్న కథలు, పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. తెలుగు కళామతల్లి ఇచ్చిన వరం రామ్’’ అని అన్నారు. అలాగే ‘చంద్రయాన్ 3’ విజయంపై ఓ ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేసి ఇస్రో టీమ్‌కు చిత్ర యూనిట్ అభినందనలు తెలిపారు.
