సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత స్టాక్ మార్కెట్లు నేడు, బుధవారం పెద్ద ఎత్తున కుప్పకూలాయి. బీఎస్‌ఇ సెన్సెక్స్, నిఫ్టీ 2 శాతానికి పైగా క్షీణతతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1628.01 పాయింట్లు లేదా 2.23 శాతం పతనంతో 71500.76 వద్ద, నిఫ్టీ 460.35 పాయింట్లు లేదా 2.09 శాతం పతనంతో 21571.95 వద్ద ముగిసింది సెన్సెక్స్ ఢమాల్ అయ్యింది. .రూ.4.33 లక్షల కోట్లు కోల్పోయిన మదుపర్లు దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మార్కెట్ క్షీణత కారణంగా ఈరోజు ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూశారు. ఈ క్రమంలో ఈరోజు ఇన్వెస్టర్లు రూ.4 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లోనే ఇన్వెస్టర్లు రూ.5.67 లక్షల కోట్లు కోల్పోయారు. బలహీన ఫలితాల తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భారీ పతనం మార్కెట్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *