సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు బుధవారం ( మే 8న) దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటల నాటికి సెన్సెక్స్ 286 పాయింట్లు క్షీణించి 73,225 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ కూడా 71 పాయింట్లు పతనమై 22,231 వద్ద ప్రారంభమైంది. దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా నష్టాల్లోనే మొదలయ్యాయి. అయితే మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సూచీలు పెరుగుతూ స్వల్ప లాభాల బాటలో నడుస్తున్నాయి. నేటి సాయంత్రానికి ఏ విధంగా ముగుస్తాయో చూడాలి. గ్లోబల్ మార్కెట్‌లో ప్రతికూల ధోరణులు సహా పలు ఆందోళనల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, లార్సెన్, HUL, ఏషియన్ పెయింట్స్, HDFC బ్యాంక్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, BPCL, కోల్ ఇండియా, టాటా స్టీల్, మారుతి సుజుకి, ONGC కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *