సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎదో కారణం గా ఇటీవల భారతీయ స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాలలోకి వెళ్ళిపోయి మదుపరులను ఆందోళనకు గురిచేస్తుంది. మరో ప్రక్క విదేశీ డాలర్ తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ కూడా రికార్డు స్థాయిలో పడిపోతుంది. ఇదిలా ఉండగా నేడు, శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో (జనవరి 10న) భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 241 పాయింట్లు పడిపోయి 77,378.62 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 95 పాయింట్లు తగ్గిపోయి 23,431కు చేరింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 769 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 1160 పాయింట్లు పతనమయ్యాయి. దీంతో మదుపర్లు ఒక్కరోజులోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 85.9400కి చేరుకుంది. ( అంటే సుమారు ఒక డాలర్ విలువ కు 86 రూపాయలు సమానం )
