సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో వరుసగా దేశీయ స్టాక్ మార్కె ట్ సూచీలు అధః పాతాళానికి పడిపోతూ మదుపరులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. నేడు, మంగళవారం కూడా స్టాక్స్ భారీ నష్టాల్లో ముగిసాయి. స్టీల్, అల్యూ మినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం, అంతర్జాతీయ మార్కె ట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో వరుసగా 5వ రోజూ సూచీలు భారీ నష్టాలు చవిచూశాయి. నేడు ఒక దశలో సెన్సెక్స్ 1200 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 23వేల దిగువకు చేరింది. నేటి ఉదయం ఓ మోస్తరు నష్టాల్లో ట్రేడయిన సెన్సెక్స్ .. మధ్యాహ్నం తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 76,030.59 పాయింట్ల వద్ద కనిష్ఠా స్థాయికి చేరింది. చివరికి 1018.20 పాయింట్ల నష్టంతో 76,293.60 వద్ద ముగిసింది. సుమారు 9లక్షల కోట్లు మదుపరులు నష్టపోయారని భావించవచ్చు.. డాలరుతో రూపాయి మారకం విలువ 60 పైసలు మేర బలపడి 86.85 వద్ద ముగిసింది.
