సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నో నెలలుగా పడిపోతూ వస్తున్నా స్టాక్ మార్కెట్ లో ఈవారం మాత్రం చాల ప్రత్యేకం.. భారీ నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కొంత వరకు నష్టాల రికవరీ బాట పట్టాయి. ఇటీవల కాలంలో తొలిసారి వరుసగా నేడు, శుక్రవారం ఐదో రోజు కూడా లాభాలతోనే సూచీలు ముగిశాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ, చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా ఉండడంతో మదుపర్లు కొనుగోళ్లకు ముందుకు వస్తుండటంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో దూసుకెళ్లాయి. గత గురువారం ముగింపు (76, 348)తో పోల్చుకుంటే నేడు శుక్రవారం ఉదయం 200 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల బాట పట్టింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. సెన్సెక్స్ చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా 77 వేలను కూడా దాటింది. చివరకు సెన్సెక్స్ 557 పాయింట్ల లాభంతో 76, 905 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 159 పాయింట్ల లాభంతో 23, 350 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.97 గా ఉంది.
