సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని మోదీ నేతృత్వంలో వరుసగా మూడో సారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశీయ సూచీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ లాభాలలో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా సూచీలకు కలిసి వచ్చాయి. సెన్సెక్స్, నిఫ్టీ జీవన కాల గరిష్టాలకు చేరకుని మదుపర్లుకు లాభాల పంట పండిస్తున్నాయి. నేడు, మంగళవారం సెన్సెక్స్ ఆల్ టైమ్ హై.. 77 వేల 301 పాయింట్ల పైన ముగించింది. . నిఫ్టీ కూడా 23,500 మార్క్ పైన స్థిరపడింది,గత శుక్రవారం ముగింపు (76,992)తో పోల్చుకుంటే దాదాపు 240 పాయింట్ల లాభంతో 77,235 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే మొదలయింది. . ఒక దశలో 370 పాయింట్లు లాభపడి 77,366 వద్ద ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. నిఫ్టీ తొలిసారి 23,500 మార్క్‌కు పైన రోజును ముగించింది. డాలరుతో పోలిస్తే రూపాయి విదేశీ మారకం విలువ 83.41గా స్థిరపడింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *