సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల దూసుకొనిపోతున్న షేర్ మార్కెట్ గత 2 రోజులుగా కుదుపులకు లోనవుతున్న నేపథ్యంలో.. తాజగా నేడు, బుధవారం సాయంత్రానికి స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ దాదాపు 676 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ముంబాయి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. అమెరికా సార్వభౌమ రేటింగ్ ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ తగ్గించడం ఇందుకు కారణం..మొత్తానికి ఫిచ్ ఎఫెక్ట్తో సెన్సెక్స్ ఓ దశలో 1000కి పైగా నష్టపోయింది తర్వాత కోలుకుంది. ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగియగా.. యూరోపియన్ మార్కెట్లు సైతం నష్టాల్లో ట్రేడవుతున్నా యి. అయితే, పిచ్ ప్రభావం తాత్కాలికమేని మార్కె ట్ నిపుణులు భావిస్తున్నారు.
