సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న నష్టాలలో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు, గురువారం భారీ లాభాలతో ముగిశాయి. నేటి ఉదయంసెన్సెక్స్, నిఫ్టీ, సూచీలు స్వల్ప నష్టాల్లో మొదలయి కంగారు పెట్టినప్పటికీ తర్వాత నుంచి భారీగా పరుగులు పెట్టాయి. ఒక దశలో నిఫ్టీ 23,861 పాయింట్ల దగ్గర గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 78, 566 పాయింట్ల గరిష్టానికి వెళ్లింది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1508.91 పాయింట్లు (1.96 శాతం) లాభంతో. 78,553.20 వద్ద, నిఫ్టీ 414.45 పాయింట్ల (1.77శాతం) లాభంతో 23,851.65 పాయింట్ల వద్ద నిలిచాయి. బ్యాంక్ నిఫ్టీ 1,172.45 పాయింట్లు పెరిగింది. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. భారతీ ఎయిర్టెల్, ICICI బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఎటర్నల్ నిఫ్టీలో ప్రధానంగా లాభాలను ఆర్జించగా, విప్రో, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా ఇంకా JSW స్టీల్ వెనుకబడ్డాయి.
