సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్నటి వరకు లాభాల బాటలో ఉన్న స్టాక్ మార్కెట్ సూచీలు నేడు, మంగళవారం (మే 6, 2025న) భారీ నష్టాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 156 పాయింట్ల నష్టపోయి 80,641 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 82 పాయింట్లు తగ్గిపోయి 24,379 పరిధిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 648 పాయింట్లు దిగజారీ 54,271 వద్ద ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 1240 పాయింట్లు కు పడిపోయింది. ఈ నేపథ్యంలో మదుపర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), టాటా మోటార్స్, NTPC, అదానీ పోర్ట్స్ , Eternal (Zomato), కంపెనీల స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఇక లాభాల్లో నిలిచిన కంపెనీలలో భారతి ఎయిర్‌టెల్, టాటా స్టీల్, మహీంద్రా & మహీంద్రా (M&M), హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా ఉన్నాయి.
