సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల నిబంధనలను సీఎం (అపద్ధర్మ) జగన్ మోహన్ రెడ్డి సెక్యూరిటీ తుంగలో తొక్కారు అని రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల కమిషన్ కి పిర్యాదు చేసారు.. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది విధులు మరచి వైసీపీ కి మద్దతుగా వినోదం కోసం పార్టీ చేసుకొన్నారని అని ఆరోపించారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకి ఫిర్యాదు చేశారు. నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎన్నికల నిబంధనలను సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఉల్లంఘించారని అన్నారు.ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ‘‘సిద్ధం’’ పోస్టర్‌తో, అధికార వైసీపీ డీజే పాటలతో పార్టీ నిర్వహించారని చెప్పారు. ఈ పార్టీలో 450 మందికిపైగా పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారని తెలిపారు. ఈ పార్టీ నిర్వహించిన సీఎం సెక్యూరిటీ గ్రూప్ ఎస్పీ అత్తాడ బాపూజీపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మరియు స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఈఓ ఎంకే మీనాను చంద్రబాబు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *