సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో పలు కారణాలతో ఖాళీ అయిన స్థానిక సంస్థల స్థానాలకు నేడు, గురువారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.కడప జడ్పీ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28 ఎంపీపీలు (MPP), 23 వైస్ ఎంపీపీ (Vice MPP) స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నిజానికి ఎక్కడ టీడీపీ కి బలం లేకపోయిన వైసీపీ నుండి వచ్చిన జంపింగ్ సభ్యులతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ చక్రం త్రిప్పాలని చుసిన కూడా క్షేత్ర స్థాయిలో వైసీపీ ఇంకా బలంగా ఉండటంతో వైసీపీ తిరిగి ఉప ఎన్నికలలో ఎక్కువ స్థానాలలో విజయబావుటా ఎగురవేస్తుంది. రాష్ట్రంలో ప్రతిష్టాకర జరిగిన కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి పోటీ పడిన టీడీపీ కూటమి నేడు, ఎన్నిక వేళా వైసీపీ నుండి సభ్యులు అనుకున్న రీతిలో తమవైపు రాకపోవడంతో నిరాశ తో భంగపడింది. దీనితో ఉమ్మడి కడప జడ్పీచైర్మెన్ గా వైసీపీకి చెందిన రామగోవింద రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ అభ్యర్థుల తిరిగి తమ బలం నిరూపించుకొంటున్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీ గా వైసీపీకి చెందిన ఆళ్ల సుబ్బమ్మ గెలుపొందారు. అనంతపురం జిల్లాలో 5 ఎంపీపీలు, 4 ఉప ఎంపిపిలలో కూడా వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ( ఒక్క కదిరి ఎంపీపీ వాయిదా పడింది) తిరుపతి రురల్ ఎంపీపీ వైసీపీ విజయం సాధించింది. విశాఖ జిల్లా మాకవర పాలెం, మాడుగుల, ఎస్ రాయవరం, దేవర పల్లి ఎంపీపీ స్తనాలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండల ఎంపీపీ కూడా తిరిగి వైసీపీ గెలుచుకొంది. అయితే , బిక్కవోలు మండలం బీజేపీ ఎంపీపీగా తేతలి సుమ ఎన్నికయ్యారు. ఏపీలోనే తొలి బీజేపీ ఎంపీపీగా తేతలి సుమ గెలిచారు. సబ్బవరం మండలం, నారపాడులో జనసేన అభ్యర్థి మామిడి లక్ష్మిని వైస్ ఎంపీపీగాగెలవడం విశేషం. మరికొన్ని చోట్ల టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలతో, తగినంత కోరం లేక ఎన్నికలు వాయిదా పడిన ఘటనలు కూడా జరిగాయి. చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం ఎంపీపీ ఉప ఎన్నికలో ఉత్కంఠత నెలకొంది.
