సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క తెలుగు రాష్ట్రాలలో శుభాకార్యల సీజన్ మరో ప్రక్క ఇటువంటి సీజన్లో విచిత్రంగా గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉంటున్నాయన్న విషయం తెలిసిందే. నేడు సోమవారం కూడా బంగారం ధర స్థిరంగా ఉంది. తులం బంగారంపై కేవలం రూ.10 మాత్రమే పెరిగింది. కాబట్టి కొనుగోలుదారులకు ఇది నిజముగా శుభవార్తే.. . కాబట్టి బంగారం కొనాలనుకునేవారు ఇవాళ ధరలో ఆలోచించకుండా కొనుగోలు చేయవచ్చు అని నిపుణులు అంటున్నారు. ఈ రోజు సోమవారం ఉదయం మన తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలలో రేట్లు గమనిస్తే హైదరాబాద్‌లో, విజయవాడలో, విశాఖలో ఒకే ధరలకు అందుబాటులో ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,560.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,980, కు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక దేశీయంగా కిలో వెండి ధర రూ.61,800 వద్దే కొనసాగుతోంది.
