సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అనిమల్ సినిమా 800 కోట్ల కలెక్షన్స్ తో ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ను గడగడలాడించిన తెలుగు దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయి సినిమా’స్పిరిట్’ షూటింగ్ కు రంగం సిద్ధం అయ్యింది. ఇప్పటికే సందీప్ వంగ సినిమా కధ స్క్రిప్ట్ , సన్నివేశాలు పక్కాగా సిద్ధం చేసారు. హీరో ప్రభాస్ ఫై ఎట్టి పరిస్థితులలో జూన్ నెలలో షూటింగ్ ప్రారంభం అవుతుందని ఆయనపై ఏకబిగిగా జరిగే 65 రోజుల షూటింగ్ తో సినిమాలో ఆయన పాత్ర అంతర్జాతీయ నటులతో ఉన్న అన్ని సన్నివేశాలు పూర్తీ అయ్యేలా పక్క స్క్రిప్ట్ , షెడ్యూలు సందీప్ వంగ తయారు చేసారని సమాచారం. అలాగే అంతే పక్కాగా వచ్చే సంక్రాంతి పండుగకు స్పిరిట్ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ మారుతి దర్శకత్వంలో దాదాపు షూటింగ్ పూర్తీ చేసుకొన్నా హర్రర్ జోనర్ లో వినోదాత్మక సినిమా ‘రాజా సాబ్’ సినిమా వచ్చే మే నెలలో విడుదల కు సిద్ధం చేస్తున్నారు. ఇక హను రఘువపుడి దర్శకత్వంలో పిరియాడికల్ సినిమా కూడా దసరా కానుకగా విడుదల చెయ్యాలని ప్రభాస్ మంచి కమిట్ తో ఉన్నారు.
