సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తాంధ్ర టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు దూకుడు పదజాలం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే.. మరి ఆయన ఇప్పుడు గౌరవ పదమైన స్పీకర్ పదవిలో అస్సినులయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ తొలిసారి నేడు, శనివారం ప్రసంగించారు. అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడుని ఎన్నుకున్న తరువాత.. స్పీకర్‌ను అభినందిస్తూ, కొన్ని సూచనలు చేస్తూ పవన్ మాట్లాడారు. సభాద్యక్ష హోదాలో సభను ముందుకు తీసుకెళ్లాలని అయ్యన్నను కోరుతూ .. ఇన్నాళ్లు మీ వాడి వేడితో కూడిన మాటలు విన్నాం.. ఇక మీ నుండి అలాంటి మాటలు లేకపోయినా బాధ్యతతో మార్గం చూపించే మాటలు వినాలి అని ఉద్భోదించారు. 2047 నాటికి ఏపీ ఉన్నతంగా వుండాలి అంటే ఇప్పుడే దానికి పునాది వెయ్యాలి. విభేదించడం, వాదించడం చర్చకు మూల సిద్ధాంతాలు. అంతేగాని, దూషణలు, కొట్లాటలు కాదు. పొట్టి శ్రీరాములు చావుకు దగ్గర అవుతూ చేసిన ఒకొక్క రోజు దీక్ష ఒకటిన్నర ఏళ్లుకు సమానం. ఆయన మహానుభావుడు, బ్రతికినప్పుడే కాదు చనిపోయినప్పుడు కూడా. ఆలా సభ్యులు గుర్తుండాలి. ఈ విలువైన ఐదేళ్లు రాబోయే తరాలకు దిశా నిర్దేశం చేసేలా వుండాలి. పశువు, పక్షి, చెట్టు అన్నీ కూడా బావుండాలి అని కోరుకుంటూన్నాను.’ అని పవన్ ఆకాంక్షించారు.
