సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కి సిద్ధం అవుతుంది.మొత్తం నాలుగు విడతల్లో కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. తొలివిడతగా రాష్ట్రంలో9 జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయనున్నారు.ఈ నెల 25న కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఎటిఎం కార్డ్స్ తరహాలో ఉండే కార్డుల పంపిణీ పూర్తిగా ఉచితంగ నిర్వహిస్తారు. తొలివిడత లో పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తారు. తదుపరి ఇక ఆగస్టు 30వ తేదీ నుండి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ 6వ తేదీ నుండి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *