సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఒకప్రక్క మహిళలపై అరాచకాలపై మాజీ సీఎం జగన్ ఓదార్పు యాత్ర చేస్తూ బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. .. మరో ప్రక్క జగన్ కుటుంబ ఆస్తుల పంపకాలపై చెల్లి కి తల్లికి ద్రోహం చేసారంటూ ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారంపై జగన్ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు వర్గం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు అయితే… జగనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు. ఆస్తిలో వాటా ఇవ్వనంటూ తల్లి, చెల్లిని రోడ్డుకు లాగడం దారుణం అని ఇటువంటి వ్యక్తి తో తాను రాజకీయాలు చెయ్యడం సిగ్గు అనిపిస్తుందని విమర్శించారు. జగన్‌, షర్మిల మధ్య నలుగుతున్న ఆస్తి పంపకాల వివాదం, షర్మిల లేఖలు రాయడం, NCLTని జగన్‌ ఆశ్రయించడం… వీటన్నింటి పైనా వైసీసీ నేత పేర్ని నాని రంగంలోకి దిగారు. మీడియా ముందుకు ఆధారాలతో తెచ్చారు… వారసత్వ ఆస్తి చట్టం ప్రకారం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి బతికున్నప్పుడే జగన్‌కు షర్మిలకు వందల కోట్ల ఆస్తి పంపకాలు జరిగాయిఅన్నారు. షర్మిలకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో 280గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల పొలం, 15మెగావాట్ల సండూర్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్, స్మాల్‌ హైడ్రో ప్రాజెక్టుల లైసెన్సులు, 22.5 మెగావాట్ల స్వాతి హైడ్రో పవర్‌ ప్రాజెక్టులో వాటాలు, విజయవాడ రాజ్‌ – యువరాజ్‌ థియేటర్‌లో 35 శాతం వాటా, పులివెందులలో మరో 7.6 ఎకరాల భూమి, విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీలో వంద శాతం వాటాలు దక్కాయి. తండ్రి చనిపోయిన 15 ఏళ్ళ తరువాత కూడా జగన్’ తన స్వార్జితపు ఆస్తిలో(భారతి సిమెంట్స్‌, సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, మీడియా వ్యాపారసంస్థలన్నీ) కూడా చెల్లి షర్మిలకు ప్రేమగా 40% వాటా ఇచ్చారని ఎంవోయూ లెక్కలతో సహా వివరించారు. అయితే ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల లో ఎటువంటి మార్పులు చేర్పులు జరగకూడదు. ఒక వేళా ఆలా జరిగితే జగన్ కు బెయిల్ రద్దు అయ్యి జైలుకు వెళ్ళవలసి వస్తుంది. ఈ విషయం తెలుసుకొని చెల్లెలు షర్మిల జగన్ వ్యతిరేకుల పంచన చేరి కుట్రపూరిత సలహాలతో ఆయా కంపెనీ లలో డైరెక్టర్స్ మార్పులకు శ్రీకారం చుట్టారు .విషయం తెలుసుకొన్న అన్న జగన్ తల్లికి చెల్లికి ఇస్తానన్న ఆస్తుల ఒప్పంద పత్రాలను నిలుపుదల చేస్తూ కోర్ట్ కు వెళ్లారని వివరించారు. చంద్రబాబు పత్తిత్తు మాటలు మానుకోవాలని ..తనకు పిల్లను ఇచ్చిన మామ ఎన్టీఆర్ పార్టీని పార్టీ ఆస్తులను దోచుకొన్నారని, సొంత తమ్ముడికి ద్రోహం చేసారని, తమ్ముడు రామూర్తి నాయుడు 30 ఏళ్ళ క్రితమే మీడియా లో చంద్రబాబు ను తిట్టాడని, చంద్రబాబు సొంత సోదరిమనులకు గాని వారి కూతుళ్ళకు గాని ఏమైనా ఆస్తి పంచాడా ? తల్లి ఆస్తి 5 ఎకరాలు కూడా తన కొడుకు లోకేష్ కు రాయించాడని.. మిగతా మనవాళ్లకు ఆస్తి ఇవ్వనివ్వలేదని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *