సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: స్వచ్ఛత హి సేవ -2024 ( స్వచ్ఛత భాగిదారి) కార్యక్రమంలో భాగంగా భీమవరంలో నేడు, గురువారం,ఉదయం విష్ణుపూర్ లోని విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణ నుండి బీవీ రాజు విగ్రహం జంక్షన్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత కు స్వయంగా నడుం కట్టాలని చెత్తను శుభ్రం చేసుకోవడం అంటే మన ఆరోగ్యాలు ను కాపాడుకోవడమేనని వక్తలు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమమునకు స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ,ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘరామ కృష్ణ రాజు జిల్లా కలెక్టర్ , C. నాగరాణి, జిల్లా, SP అద్నాన్ నయీం అస్మి మునిసిపల్ కమిషనర్ కె.రామచంద్రా రెడ్డి మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో ఆసక్తి కర అంశం ఏమిటంటే.. ఎమెల్య అంజిబాబు పచ్చ జెండా ఊపితే సైకిల్ ర్యాలీలో రఘురామా ఉత్సహంగా పాల్గొనడం. జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *