సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్, స్వర్ణ ఆంధ్రా స్వచ్ ఆంధ్రా లో భాగంగా భీమవరం మున్సిపాలిటీలో మెప్మా ఆధ్వర్యంలో స్థిరమైన ఘన వ్యర్థాలు మరియు వాడిన నీటి నిర్వహణపై ప్రభావవంతమైన అవగాహన కల్పించడం కొరకు సామర్ధ్యం పెంపుదల శిక్షణను స్థానిక మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్ నందు నేడు, సోమవారం నిర్వహించారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను నాలెడ్జింగ్ పార్టనర్స్ సహస్ మరియు వాష్ ఇన్స్టిట్యూట్ సంస్థల సహకారంతో ఎంతో అట్టహాసంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ శిక్షణ కార్యక్రమంను 76 మంది MEPMA RP’s కు శిక్షణ ఇవ్వడం జరిగింది.. మున్సిపల్ కమిషనర్ కే రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ ఫీల్డ్ లెవెల్ ఈ శిక్షణ అనంతరం స్వర్ణ ఆంధ్రా స్వచ్ ఆంధ్రా కార్యక్రమాలు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని,కంపోస్టింగ్ విధానము,అలాగే Swacha సర్వేక్షణ అవార్డులో మా భీమవరం మున్సిపాలిటీ మొదటి స్థానం కొరకు ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది , MEPMA CMM డి శివ ప్రసాద్, కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ పి . రాము , రిసోర్స్ పర్సన్ టీ.మధుసూదన రావు ,వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *