సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వాతంత్ర సమరయోధులు బాల గంగాధర తిలక్ స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలను స్వదేశీ ఉద్యమంతో అనుసంధానిద్దాం అని, ప్రతి ఇంట్లో స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించడం ద్వారా ఆత్మ నిర్భర్ నిర్మాణంలో భాగస్వాములవుదాం అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా దేశ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భీమవరంలోని బిజెపి నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో నేడు బుధవారం నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మనం ఈ పండుగను స్వదేశీ ఉద్యమంతో అనుసంధానిద్దామని ఆయన పిలుపునిచ్చారు. పండుగకు వాడే మట్టి విగ్రహాలు, పూజా సామగ్రి, వస్త్రాలు, అలంకరణలు వంటివి స్థానిక కళాకారులు, కార్మికులు తయారుచేసిన స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేసి వినియోగించాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా ఎల్లప్పుడూ “భారతదేశంలో తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేద్దాం” చేతి వృత్తులను ప్రోత్సహిద్దాం అని పిలుపునిస్తున్నారని అన్నారు.ఈ వేడుకలలో శ్రీమతి భూపతిరాజు వెంకటేశ్వరి దేవి, అల్లూరి సాయి దుర్గరాజు, కలిదిండి వినోద్ వర్మ, బుద్ధరాజు బలరామకృష్ణరాజు, పేరిచర్ల సుభాష్, కాగిత సురేంద్ర, అడబాల శివ, వబ్బిలి శెట్టి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
