సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కారికేయ 2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తెలుగు హీరో నిఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న మరో పాన్‌ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంయుక్త, నభానటేశ్‌ కథానాయికలు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో భువన్‌, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవిబస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. తాజా షెడ్యూల్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రబృందం తెరకెక్కిస్తోంది. 12 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌ కోసం చిత్రబృందం రూ. 8 కోట్లు ఖర్చు చేస్తోంది. రెండు భారీ సెట్స్‌ను రూపొందించారు. వియత్నాంకు చెందిన ఫైటర్లతో పాటు 700 మంది ఆర్టిస్టులు ఈ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిఖిల్‌ బరిలోకి దిగేముందు ఆసక్తిగా జనాలను గమనిస్తున్న లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అది సినిమా ఫై ఆసక్తిని పెంచుతూ బాగా వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *