సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ రాజకీయ ఉద్దండుడు గా ప్రసిద్ధి పొందిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ, చేగొండి హరిరామ జోగయ్య సలహాలు ఇక చాలు అని పవన్ కళ్యాణ్ పరోక్షంగా విమర్శించిన నేపథ్యంలో.. ఆయన కుమారుడు పాలకొల్లు కు చెందిన కీలక కాపు నేత చేగొండి సూర్యప్రకాశ్ గత సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో వైసిపి లో చేరిపోయి పలు మీడియా ఛానెల్స్ లో పవన్ కళ్యాణ్ ఫై తీవ్ర స్థాయి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నేడు, శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు, కోటికల పూడి చినబాబు మీడియా సమావేశం లో మాట్లాడుతూ..మా అధినేత పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేసే స్థాయి చేగొండి సూర్యప్రకాశ్ కి లేదు గతంలో ‘దొంగల పార్టీ వైసీపీ… అని వైసీపీ గురించి కామెంట్స్ చేసిన సూర్య ప్రకాశ్ ఇప్పుడు ఆ పార్టీలోకే వెళ్ళాడు.అలాంటి వ్యక్తిని ఏమనాలో అతని విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆయనకు హరరామజోగయ్య గారి కొడుకు అనే గుర్తింపు తప్ప వ్యక్తిగతంగా ఏ గుర్తింపూ లేదు. సూర్యప్రకాశ్ కి స్వయం ప్రకాశం లేదు అయిన కూడా జనసేన ఆచంట నియోజకవర్గానికి పార్టీ ఇంచార్జ్, ఆ తరవాత పి.ఏ.సి. సభ్యుడి హోదా కల్పించింది జనసేన పార్టీ అనే విషయం మర్చిపోకూడదు. ఆ వ్యక్తి వైసీపీలోకి వెళ్ళగానే పాలకొల్లులో ఆ పార్టీ వాళ్ళే తిడుతున్నారు. ఇలాంటి వ్యక్తి మా పార్టిలో నుంచి వెళ్లిపోవడం సంతోషకరమని కొటికలపూడి గోవిందరావు అన్నారు.
