సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలోని శ్రీపార్వతీ సమేత.. స్వయం భువుడు శ్రీశక్తీశ్వర స్వామి దేవస్థానంలో షష్టి వేడుకలు ముగింపు సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, పుట్టలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలను నిర్వహించి మహా నివేదనకు హారతులు ఇచ్చి తదుపరి అన్న సమారాధన ను వడ్డన తో ప్రారంభించారు. మహిమానిత శ్రీ శక్తేశ్వరుని సన్నిధిలో ( శివుడు తలక్రిందులుగా ఆసనం వేసిన భంగిమలో వెలిశారు) షష్టి ముగింపు వేడుకల నిర్వాహకులను అభినందించారు. అనంతరం భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో టీడీపీ నేత కోళ్ల నాగేశ్వర రావు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ ఈవో, గ్రామస్తులు, కూటమి నేతలు పాల్గొన్నారు.
