సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అనారోగ్యంతో మరణించిన , మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు హైదరాబాద్ లోని నివాసానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాసేపటి క్రితమే చేరుకున్నారు. ఈ సందర్భంగా కృష్టంరాజు భార్య, పిల్లలు, సినీవారసుడు హీరో ప్రభాస్‌ ను,కుటుంబసభ్యులు ను కేంద్రమంత్రి ఓదార్చి ఆయనతో అనుభవాలను పంచుకొన్నారు. తదుపరి నేటి, మధ్యాహ్నం ఫిల్మ్‌నగర్‌లో జరిగే కృష్ణంరాజు సంస్మరణ సభలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని, సీనియర్ హీరోగా తెలుగువారి మనస్సు దోచుకొన్న కృష్ణంరాజు తెలుగువారి హృదయాలలో రారాజుగానే చిరస్థాయిగా ఉంటారని,కేంద్ర మంత్రిగా కూడా అయన దేశానికీ చేసిన సేవ మరచిపోలేమన్నారు. నేటి సాయంత్రం 4:20 గంటలకు కేంద్రమంత్రి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. రాజ్‌నాథ్ వెంట కిషన్ రెడ్డి , లక్ష్మణ్ , చింతల తదితరులు ఉన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు పని చేసినప్పుడు సహచర మంత్రిగా రాజనాధ్ సింగ్ భీమవరం లూధరన్ హైస్కూల్ లో జరిగిన భారీ బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *