సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డిఎన్నార్ కళాశాల అసోసియేషన్ సెక్రటరీ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు ) తండ్రి సోమరాజు (94) ఆదివారం మృతి చెందారు, వారి కుటుంబ సభ్యులను,నేడు, సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, పరామర్శించారు. సోమరాజు చిత్రపటానికి ఎమ్మెల్యే అంజిబాబు. మండలి చైర్మన్ మోషేను రాజు పూలమాలలు వేసి నివాళిలర్పించి సంతాపం తెలిపారు. టిడిపి రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, పొత్తూరి బాపిరాజు, బండి రమేష్ కుమార్, కారుమూరి సత్యనారాయణ మూర్తి, చిలుకూరి నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.
