సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 36వ వార్డు నుండి పలుమారులు కౌన్సిలర్ గా పనిచేసి పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ గా కూడా సేవలు అందించిన దివంగత ములుగుర్తి వెంకట రామయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు ములుగుర్తి సుధీర్ ఆధ్వర్యంలో నేడు, శనివారం 100 మంది, పేద వృద్ధులకు, వికలాంగులకు బియ్యం పంపిణీ కార్యక్రమం భీమవరం అనాకోడేరు కాలువ సమీపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు విచ్చేసి పంపిణీ ప్రారంభించి మాట్లాడుతూ.. గతించిన తన తండ్రి ములుగుర్తి వెంకటరామయ్య పేరిట వారి కుమారుడు ములుగుర్తి సుధీర్ కూడా తన తండ్రి లానే తన సంపాదనలో కొంత భాగాన్ని వెచ్చించి వయోభారంతో ఉన్న వృద్ధులకు ప్రతినెలా ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వాసర్ల ముత్యాలరావు, బేతల సంతోష్, ములుగుర్తి నాగేశ్వరరావు, యర్రా సర్వేష్, మజ్జిప్రసాద్, వరసాల చిన్న, గుత్తుల వేణు , దనిమిరెడ్డి సూర్య, వింజవరపు గోపి, ఇంజమూరి లాజర్, గొల్లపల్లి స్వామి, ములుగుర్తి చంటి, కావ్య తదితరులు పాల్గొన్నారు.
