సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మవిభూషణ్ రతన్ టాటా మరణం దేశానికీ తీరని లోటని తెలియజేస్తూ భీమవరంలో ప్రముఖులు, పలు సంఘాలు పెద్దలు ఘన నివాళ్లు తెలియజేస్తున్నారు. ఈనేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మహామనిషి స్వర్గీయ రతన్ టాటా మరణంపై సంతాపం తెలుపుతూ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ .. రతన్ టాటా మరణంతో భారతీయులు తీవ్ర విచారంలో ముగినిపోయారని, భారత దేశాభివృద్ధిలో ఆయన పోషించిన కీలక పాత్రను దేశ ప్రజలు నిరంతరం గుర్తించుకుంటారన్నారు. రతన్ టాటా అత్యున్నత శిఖరాలను చేరిన కూడా ఆయన నిరాడంబరత్వ వ్యకిత్వంతో పాటు మానవత్వాన్ని కలిగి ఉన్నారని నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నేతలు కోళ్ల నాగేశ్వర్రావు, ఇందుకూరి సుబ్రహ్మణ్య రాజు, విజ్జురోతి రాఘవులు, ఆకుల కృష్ణ, సూర్య, రెడ్డి సత్తిబాబు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
