సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఢిల్లీలో నేడు, శుక్రవారం స్వర్గీయ వై ఎస్ చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో టి సుబ్బరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఢిల్లీలో మీడియాతో ఎంపీ రఘురామా మాట్లాడుతూ.. .. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో నిజంగా మార్పు వచ్చిందని.. అయితే నా వల్లనే ప్రజల్లో మార్పు వచ్చిందని అనడం లేదు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇంద్రప్రస్ధం లో ఉండి తాను చెబుతుండగా, ప్రజల మధ్యనే ఉంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, ప్రజలు ముందుకొచ్చి మాట్లాడలేరని అన్నారు. తాను ప్రజల మధ్యకు వస్తే ప్రభువులకు కంటగింపు గా మారిందన్నారు. అందుకే తనపై రాష్ట్రంలో అడుగుపెట్టిన ప్రతిసారి మూడేసి కేసులను పెడుతున్నారని, ఆ కేసులలో బెయిల్ కోసం ఆరేసి నెలల సమయం పడుతుందన్నారు. తాజగా మీడియాతో అబద్దానికి, నిజానికి మధ్య యుద్ధం జరుగుతుందని సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేసారు. ప్రధానమంత్రి తో ముఖ్యమంత్రి భేటీ అయిన వెంటనే ఆయన కోరిన అన్ని కోరికలపై సమీక్షించి అమలు చేస్తామని హామీ ఇచ్చారని బుగ్గన, విజయసాయిలు చెప్పుకొచ్చారని కానీ నిజానికి ఏడాది జూన్ లో 8, 212 కోట్ల రూపాయల బాండ్లను రాష్ట్ర ప్రభుత్వం భేషరతుగా గ్యారంటీ ఇచ్చి, 9.4 శాతం మేరకు వడ్డీ చెల్లించే విధంగా విడుదల చేయడాన్ని కేంద్రం తప్పు పట్టిందన్నారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి , రాష్ట్ర ప్రభుత్వం వంతుగా చెల్లించవలసిన 3,558 కోట్ల రూపాయల బకాయిల గురించి, ఆర్ఓబీ ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఎందుకని అప్పగించ లేదని కేంద్రం రాష్ట్రాన్ని ప్రశ్నిస్తుందని అన్నారు. గ్రామ సడక్ యోజన కింద నిధులు మంజూరు చేశామని, ఆ రోడ్ల నిర్మాణం ఇప్పటికీ పూర్తి చేయలేదని రెండేళ్లకు 700 కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పటికీ, వాటి యుటిలైజేషన్ సర్టిఫికెట్లను ఇప్పటి వరకు సమర్పించలేదని, వాటిని సమర్పించాలని కేంద్ర అధికారులు ఆదేశించారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *