సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఎఫ్ఐడీఈ ( FIDE) వరల్డ్ రాపిడ్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన చెస్ క్రీడాకారులు కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసి తమ సత్తా చాటడం పట్ల సీఎం చంద్రబాబు వారికీ అభినందనలు తెలిపారు. తదుపరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రుల క్యాబినెట్ సమావేశం నేడు, సోమవారం ఉదయం నుండి సుదీర్ఘంగా (AP Cabinet ) కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu ) అధ్యక్షతన, డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో అదనంగా మరో 3 కొత్త జిల్లాలకు సంబంధించి కీలక చర్చ జరుగుతోంది. తాజాగా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీల టెండర్లు కు కార్పొరేట్ వర్గాల నుండి స్వాందన రాకపోవడం.. ఇక , పీపీపీ విధానంపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తం 21 అంశాలు అజెండాగా చర్చ జరుగుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *