సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ నేత, మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ ని హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేసారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండున్నరేళ్ల క్రితం హత్యకు గురైన వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసు లో శ్రీకాంత్ నిందితుడుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదని బాధిత కుటుంబం పేర్కొన్నది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమేష్ అనే వ్యక్తిని పోలీసులు విచారణ చేయగా అతను ఇచ్చిన సమాచారం ప్రకారం… తమిళనాడులోని మధురైలో ఉంటున్న శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఏపీకి తరలిస్తున్నారు. అయితే ఈ అరెస్ట్ ఫై మాజీ మంత్రి విశ్వరూప్ మీడియాతో మాట్లాడుతూ.. నిజానికి పోలీస్ FIRలో తన కుమారుడి పేరు లేకపోయిన కక్ష తో కూటమి నేతల ప్రోద్బలం తో అతని ని అరెస్ట్ చేసారని. తన కొడుకు ప్రాణాలు పొసే డాక్టర్ అని వ్యక్తి ప్రాణాలు తీసేంత పని చెయ్యడని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *