సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇజ్రాయిల్ ఫై హమాస్ తీవ్రవాదులు దాడి చేసి వేలాది మందిని పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ పాలస్తీనా ఫై చేపట్టిన మరణ కాండలో,వ్యాధులతో ఆహారం దొరక్క లక్షల మంది మరణించగా మొత్తం గాజా నగరం నేలమట్టం అయ్యింది.. వేలాది అమాయక పిల్లల మరణాలు ప్రపంచాన్ని కదిలించాయి. ఉన్నవారు తినడానికి తిండి కూడా దొరకని దయనీయ పరిస్థితి లో ఉన్నారు. మొత్తానికి హమాస్ తాజగా.. రాజీకి ముందుకు వచ్చింది. ఎట్టకేలకు పాలస్తీనా లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ హెచ్చరికలతో ఇజ్రాయెల్‌ బందీల విడుదలకు హమాస్‌ అంగీకారం తెలిపింది. దీనితో యుద్ధం ఆగిపోయిందని ఇక ఇజ్రాయిల్ దాడులు చెయ్యడని తాజగా డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ తాజా పరిణామంపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. గాజాలో డోనాల్డ్ ట్రంప్‌ చేస్తున్న శాంతి ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని మోదీ ఎక్స్ లో సందేశమిచ్చారు. . శాశ్వత శాంతి ప్రయత్నాలకు భారత్‌ మద్దతు ఉంటుందని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *