సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇస్మార్ట్ శంకర్ తరువాత సరైన హిట్ లేక వెనుకబడిన హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన తాజా మైత్రి మూవీ మేకర్స్ వారి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ విడుదలై, ఎట్టకేలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, కన్నడ స్టార్ ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. సినిమా హీరోలకు అభిమాన సంఘాల నేతల మధ్య ఉండే అనుబంధాన్ని వాస్తవ ఘటనలు జోడించి తీసిన ఈ సినిమా లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక హీరో పాత్రలో అలరించారు… యూత్ ను ఆకట్టుకొనేలా రామ్ తిరిగి మాస్ ఊపుతో ‘రొమాంటిక్’ హీరోగా కనిపిస్తూ, ప్రేక్షకులను ఆకట్టే సినిమాను అందించాడని విమర్శకులు, ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ మొదటి రోజు 4న్నర కోట్లు వసూళ్లు చెయ్యగా ఉన్నాయి. . ఇదే సమయంలో, అమెరికా మార్కెట్‌లో $250K కంటే ఎక్కువగా కలెక్ట్ అయ్యింది. రామ్, భాగ్యశ్రీ ప్రస్తుతం అమెరికాలోనే సినిమా ప్రమోషన్‌లకు చేరుకుని, అభిమానులతో మీట్ అవుతున్నారు. ఈ వీకెండ్ నేపథ్యంలో, కలెక్షన్స్ మరింత పెరుగుతాయని, వివేక్- మెర్విన్ సంగీతంలో పాటలు యూత్ ను ఊపేస్తున్నాయి.
