సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని నేడు, సోమవారం లాభాలతో ప్రారంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపు (83, 216)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత ఉదయం 10:15 గంటల సమయంలో నుండి సెన్సెక్స్ 348 పాయింట్ల లాభంతో 83, 565 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 104 పాయింట్ల లాభంతో 25, 596 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 198 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 132 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.69గా ఉంది.
