సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో వాతావరణం ఏపీలో పూర్తిగా గాడి తప్పింది. వర్షాకాలం లో గత 50రోజులు గా అప్పుడప్పుడు కాస్త జల్లులు తప్ప మండు వేసవి ప్రచండ ఎండలు కొనసాగుతూనే ఉన్నాయి. అల్ప పీడనాలు వచ్చిన కూడా ఏపీని వరుణుడు కరుణించడం లేదు. అయితే కోస్తా ఆంధ్ర లోగత రాత్రి నుండి వర్షాలు పడుతున్నాయ్. భీమవరం లో కూడా నేటి ఆదివారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. తదుపరి వర్షపు జల్లులు కొనసాగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం (LPA) ఏర్పడబోతోంది. ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా, ఈ వర్షాలు తెలంగాణతోపాటు ఏపీలో కూడా ప్రభావం చూపించనున్నాయి
