సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లు పెంచుతూ.. నిర్మాత ఏ ఏం రత్నం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఏపీ సర్కారు పది రోజులకు టికెట్ ధరను పెంచుకునేలా అనుమతి ఇస్తూ నిర్ణయం చేసింది. మొఘల్‌ రాజుల నుంచి కోహినూర్‌ వజ్రాన్ని చేజిక్కించుకోవడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకునేందుకు వీరమల్లు సిద్ధమవుతున్నారు. కారణాలు ఏవైనా 5 ఏళ్ళ పాటు సుదీర్ఘ కాలం షూటింగ్ జరిగిన ఈ సినిమా జులై 24వ తేదీన రిలీజ్ కానుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని థియేటర్ల యాజమాన్యాలకు 23.07.2025 రాత్రి 9.00 గంటలకు ప్రీమియర్ షో కోసం ప్రతి టికెట్‌పై రూ.600/- ప్లస్ GST మేరకు టిక్కెట్ రేట్లను పెంచడానికి అనుమతి లభించింది. ఆ తర్వాతి షోలకు ప్రతి టికెట్‌పై దిగువ తరగతికి 100/- (GSTతో సహా), ఉన్నత తరగతికి రూ.150/- (GSTతో సహా), మల్టీప్లెక్స్‌కు రూ.200/- (GSTతో సహా) రేట్లు ఫిక్స్ చేశారు. అంటే సినిమాఫై తరగతి టికెట్ ధర సుమారు 350 -400 రూపాయలు ఫై మాటే నన్న మాట..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *