సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు కారణాలు ఏవైనా 5 ఏళ్ల పాటు షూటింగ్ చేసిన పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఫస్ట్ టైం పీరియాడికల్ స్టోరీతో ‘హరిహర వీరమల్లు’సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కు 5 రోజులు ముందు పవన్ ప్రమోషనలకు రావడంతో సినిమా ఫై అభిమానుల అంచనాలు పెరిగాయి. మరి సినిమా కధ విషయానికి వస్తే.. 16వ శతాబ్దంలోఢిల్లీలో మొగలాయి చక్రవర్తి ఓరంగాజేబు కాలంలో ‘హరి హర వీరమల్లు; (పవన్ కళ్యాణ్) అనే మంచి మనస్సు ఉన్న బందిపోటు దొంగ దొంగతనాలు చేసి పేద ప్రజలకు పంచిపెడుతుంటాడు. అయితే, చిన్నదొర (సచిన్ కేడ్క ర్) తన దగ్గర ఉన్న వజ్రాలను గోల్కొండ నవాబులకు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని ముందే దొంగతనం చేసి తనకు ఇవ్వాలని వీరమల్లుతో చిన్న దొర ఒప్పందం కుదుర్చుకొంటాడు. ఇక్కడే పంచమి (నిధి అగర్వాల్) పరిచయం అవుతుంది. వజ్రాలతో పాటు పంచమిని కూడా అక్కడ నుంచి వీరమల్లు తప్పించాలి. ఈ క్రమంలో హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్ తో గోల్కొండ నవాబులకు వీరమల్లు దొరికిపోతాడు. అప్పుడు గోల్కొండ నవాబు…వీరమల్లుతో ఢిల్లీలో ఉన్న మొగల్ చక్రవర్తి ఔరంగజేబు దగ్గర ఉన్న నెమలి, సింహాసనంలో ఉన్న కోహినూర్ డైమాండ్‌ను దొంగలించి తనకు ఇవ్వాలని కోరగా వీరమల్లు దీనికి ఎందుకు ఒప్పుకున్నాడు ? కోహినూర్ ను పరమ కిరాతకుడైన ఔరంగజేబు నుండి సాధిస్తాడా? అనేవి వెండి తెరపై చూడవలసిందే.. సినిమాను సింపుల్ గా విశ్లేషిస్తే.. క్రిష్ దర్శకత్వం వహించిన ఇంటర్వెల్ ముందు కధనం చిత్రీకరణ ఫైట్స్ చక్కగా కుదిరి సినిమా ఫై అంచనాలు పెరుగుతాయి. ఇక ఇంటర్వెల్ తరువాత క్లయిమాక్స్ వరకు సినిమా గాడి తప్పింది. డైరెక్టర్ జ్యోతికృష్ణ కు పవన్ కళ్యాణ్ డేట్స్ సమస్య వల్ల కావచ్చు అనుకున్న స్థాయిలో తియ్యలేకపోయారు. కొన్ని షాట్స్ అసలు పవన్ నటించారా ? A I తో కవర్ చేస్తారా? అన్నట్లుగా హీరో లుక్స్ మాత్రం కొన్ని చోట్ల సింక్ అవ్వవు. సీజీ వర్క్ చాల దారుణంగా ఉంది. హీరో గుర్రం పై వెళ్తుంటే… బైక్ నడిపినట్టు అనిపిస్తుంది.ఇలా ఎన్నో ఇబ్బందులు.. ఇక పవన్ బాగానే నటించిన సనాతన ధర్మం , ప్రస్తుత రాజకీయ డైలాగ్స్ కావాలని తరుచు వినిపిస్తూ సినిమాలోకి ప్రేక్షకుడు లీనం కాకుండా అడ్డుకొంటున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా డిజైన్ చేసిన చౌకిదానా లో 15నిముషాల ఫైట్ అభిమానులకు బాగా నచుతుంది. విలన్‌గా బాబీ డియోల్ సరిగ్గా సెట్ అయ్యాడు.. 250 కోట్లు సినిమా అంటున్నారు కానీ ఏ సెటింగ్ క్వాలిటీగా లేవు. అయితే క్రిష్ చేసిన సన్నివేశాలు ‘శాతకర్ణి’ తరహాలో క్వాలిటీగా ఉన్నాయ్. కీరవాణి మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద హైలైట్.. నటీనటులు అందరు తమ పరిధిలో బాగా చేసారు. ఈ సినిమా పవన్ కోసం చూసెయ్యవచ్చు..
