సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో నిలిచిపోయిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఎట్టకేలకు నిన్నటితో పవన్ కళ్యాణ్ పూర్తీ చేసారు. 250కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా గత 3న్నర ఏళ్లుగా షూటింగ్ జరుగుతూనే ఉంది. క్రిష్ దర్శకత్వంలో 70 శాతం షూటింగ్ పూర్తీ చేసుకొన్నా ఈ సినిమా నుండి ఆయన తప్పుకోవడంతో నిర్మాత కుమారుడు దర్శకత్వంలో పూర్తీ చేసారు. ఎట్టకేలకు మొన్న నిన్న 2 రోజులు ఏకబిగిగా జరిగినా షూటింగ్ లో పవన్ పాత్ర సన్నివేశాలు పూర్తీ చేసి సినిమాకు గుమ్మడి కాయ కొట్టారు. ఎట్టి పరిస్థితులలో ఈ మే నెల 30వ తేదీన లేదా జూన్ మొదటి వారంలో విడుదల చెయ్యాలని నిర్మాత భావిస్తున్నారు. దీనికి పవన్ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో తన వంతు సహకారం అందిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్..
