సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్రము తో పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఎలా దూసుకొనిపోయారో దేశం యావత్తు చూసింది. ఇక పవన్ తన సినీ జీవితం ఫై ద్రుష్టి సారించారు. బహుశా రేపటి గురువారం నుండి ఆయన ఇక షూటింగ్ బరిలోకి దిగిపోయి ఏకబిగిగా 20 రోజులు షూటింగ్ లో పాల్గొని హరిహర వీరమల్లు లో తన పార్ట్ షూటింగ్ కీలక సన్నివేశాలు పూర్తీ చేస్తారని సమాచారం.. గత 3 ఏళ్లుగా షూటింగ్ పూర్తీ కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తోన్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా బ్యాలెన్స్ షూట్ చిత్రీకరణను తిరిగి స్టార్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ సెట్స్‌లోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ఓ అప్డేట్ వదిలారు.బాలీవుడ్ నటుడు, ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్పా ఔరంగ జేబు పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో సినిమా తయారు అవుతుంది.
