సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దర్శకుడు హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో జగపతి బాబు కీలక పాత్రలో వస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ టీజర్ విడుదలైంది. రవి తేజ యాక్షన్ హీరోగా కనిపించారు. కొత్త హీరోయిన్ తో పాటు జగపతి గెటప్ కాస్త వైరిటీగా అనిపించాయి. ప్రముఖ సినీ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తోంది. నిన్న జరిగిన ఈ టీజర్ ఫంక్షన్ కి హీరో రవితేజ వస్తాడు అనుకున్నారు, కానీ అతను రాలేదు. మరి ఈ సినిమా ప్రమోషన్ ఫై హీరో కే ఆసక్తి లేదంటే ఏమనుకోవాలి? మామూలుగానే దర్శకుడు హరీష్ శంకర్ తన మాటలతో, సామాజిక మాధ్యమాల్లో వివాదాలతో ట్రేండింగ్ లో ఉంటాడు. అందుకేనేమో నిన్నటి టీజర్ కన్నా, అతను మీడియా వాళ్ళతో మాట్లాడిన మాటలే ఎక్కువ వైరల్ అవుతున్నాయి. ఈ ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఇంతకు ముందు అజయ్ దేవగన్ నటించిన ‘ది రైడ్’ సినిమాకి అనువాదంగా చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *