సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో గెలుస్తుందని ఫలితాలపై అనేక విశ్లేషణలు సర్వేలు జరిగినప్పటికీ ఓటమి చెందటంతో EVM టాంపరింగ్ వివాదం మరోసారి దేశాన్ని అట్టుడుకిస్తుంది. ఇదిలా ఉండగా తాజగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వక ఫిర్యాదు చేసారు. . కనీసం 20 నియోజకవర్గాల్లో ఈవీఎంలను హ్యాక్ చేశారని చెబుతూ 7 నియోజకవర్గాల్లో జరిగిన అవకతవకలపై ఆధారాలు సమర్పించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రకటించారు. మిగతా 13 నియోజకవర్గాలకు సంబంధించిన ఆధారాలు 48 గంటల్లో సమర్పిస్తామని ఈసీకి తెలిపామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిన చోట్ల ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ 99ు చూపాయని, అభ్యర్థులు గెలిచిన చోట్ల ఈవీఎం ల బ్యాటరీ ఛార్జింగ్ 60ు-70ు మాత్రమే ఉందని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఏపీలో కూడా ఇటువంటి EVM వ్యవహారం ఫై వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఈసీ కి, హైకోర్టు కు పిర్యాదు చేసినప్పటికీ ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. ముందుకు సాగలేదు.
