సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న జరిగిన శాసన మండలి సమావేశాల్లో వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వాస్తవాలు తెలుస్తుకోకుండా శాసన మండలి చైర్మన్, కొయ్య మోషేను రాజు ని క్రైస్తవుడిగా పేర్కొనడాన్ని ఆక్షేపిస్తూ నేడు, గురువారం మండలిలో వైసీపీ సభ్యులు తీవ్ర ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉండగా భీమవరంలో పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆయన హిందూ స్వామిజీలతో, భీమవరంలో దశాబ్దాలుగా ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమానికి రావడంతో పాటు ఆయన ఇంట జరిగే శుభకార్యాక్రమాల్లో బౌద్ధ పద్దతి పాటిస్తారు అని భీమవరం ప్రజలకు తెలుసు. ఈనేపథ్యంలో భీమవరం ప్రముఖ వ్యాపార సంస్తలు నిర్వహిస్తున్న ఆర్య వైశ్య ప్రముఖులు ఒక ప్రకటనలో .. తామందరంతో కలసి మోషేను రాజు అనేకసార్లు మమ్మల్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తీసుకు వెళ్ళడం జరిగింది, స్థానికంగా జరిగే అన్ని హిందూ పండుగలలో మరియు హిందూ దేవాలయాలలో జరిగే భక్తి కార్యక్రమాలలో ఆయన పాల్గొని దైవ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలాంటి వ్యక్తిని క్రైస్తవుడిగా పేర్కొనడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మోషేను రాజు గారికి క్షమాపణలు చెప్పాలని మంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాము.అని 1) రాజా బాల మస్తానయ్య 2) గూడూరు బాల మురళీ 3) చక్కా శ్రీనివాస్ 4) వోలేటి శ్రీనివాస్ గుప్తా 5) గుండు కిషోర్ 6) పరుచూరి నాగేశ్వర రావు 7) నూలి ప్రసాద్ 8) యాదాల ప్రసాద్ లేఖ విడుదల చేసారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పై మతాన్ని అంటగట్టడం సరికాదని, దళిత ప్రజాప్రతినిధుల పట్ల కూటమి ప్రభుత్వం వైఖరి తీరు మార్చుకోవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు విమర్శించారు. పెద్దల సభకు అధ్యక్షునిగా ఉన్న చైర్మన్ మోషేన్ రాజు “నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువును.”తనను బలవంతంగా వేరే మతంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మతాన్ని నిరూపించుకునే దుస్థితి రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదని మండిపడ్డారు.( up file photo)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *