సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏ దేవుడు అయినా ఏ మత గ్రంధమైనా మంచిని చెయ్యమనే బోధిస్తారు.. తప్పుడు పనులను కాదు.. అయితే దేశంలో ఇటీవల కొందరిలో ఇస్లామిక్ మతోన్మాదం కొత్త పుంతలు త్రొక్కుతుంది. తాజగా.. భోపాల్ -మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెలుగు చూసిన నివ్వెరపోయే నిజాలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఫర్హాన్ ఖాన్ నేతృత్వంలోని ఓ ముఠా హిందూ మతానికి చెందిన భోపాల్ లో కాలేజీ విద్యార్థినులను ఒక పథకం ప్రకారం హిందూ అబ్బాయిల పేరుతొ పరిచయం చేసుకొని, ఖరీదైన కార్లతో తిరుగుతూ డబ్బున్న వారిలా నటించడం, ప్రేమ పేరుతొ అత్యాచారాలకు పాల్పడటం, వారిని మత మార్పిడికి బలవంతం చేసేందుకు యత్నించడం వంటి దారుణాలకు ఒడిగట్టింది. పోలీస్ విచారణలో నిందితుడు ఫర్హాన్ పశ్చాత్తాపం చూపకపోగా, హిందూ యువతులపై అత్యాచారం చేయడం తన నమ్మకాల ప్రకారం’ జిహాద్’ “పుణ్యకార్యం” అని చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేసింది. 19 ఏళ్ల యువతి భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఫర్హాన్ నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు ఇండోర్‌కు పారిపోయినప్పటికీ నిందితుడు ఆమెను వెంబడించి వేధింపులు కొనసాగించాడు. ఫర్హాన్, అతని అనుచరులు ప్రధానంగా ఇతర నగరాల నుంచి భోపాల్‌కు చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినులను లక్ష్యంగా చేసుకున్నారని తేలింది. పోలీస్ దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ, గ్యాంగ్ కు చెందిన 5గురు యువకుల ఫొటోలు మీడియాకు విడుదల చేసిన తరువాత.. మరింతమంది బాధితులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. తాజాగా ఐదో బాధితురాలు బయటకు వచ్చింది. ఏడాది క్రితం ఫర్హాన్, మరో నిందితుడు అలీ తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. అశోకా గార్డెన్ ప్రాంతంలో భోజనానికి పిలిచి, గంజాయితో నింపిన సిగరెట్ ఇచ్చి మత్తులోకి దించిన తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపింది. ఈ విషయం బయటకు చెబితే అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు విడుదల చేస్తామని నిందితులు బెదిరించినట్లు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *