సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్:ఇటీవల అడవి శేషూ తో మంచి ‘హిట్ 2’ కొట్టిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో సీనియర్ అగ్రహీరో వెంకటేశ్ సినిమా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. వచ్చే ఫిబ్రవరి నెల నుండి షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. శైలేష్ చెప్పిన కథకు వెంకీ ఫిదా అయ్యారట. ఈ సినిమాలో వెంకటేశ్‌కు జోడీగా ‘కెజియఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించనున్నారని సమాచారం అందుతుంది. ఈ ప్రాజెక్టును నిహారిక ఎంటర్ టైన్‌మెంట్ నిర్మించనుంది. గత ఏడాది ఎఫ్ 3 తో మంచి హిట్ ఇచ్చిన వెంకీ ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ , పూజ హెగ్డే తో కలసి భారీ మల్టి స్టార్ హిందీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *