సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హిమాచల్‌ప్రదేశ్‌పై గత కొద్ది రోజులుగా ప్రకృతి ప్రకోపం చల్లారడం లేదు. భారీ వర్షాలు.. ఇంకోవైపు కొండచరియలు విరిగిపడడంతో భారీగా ప్రాణ, ఆస్తి జరిగింది. వాతావరణం బట్టి చార్ ధామ్ యాత్రలకు కూడా భక్తులకు బ్రేక్ ఇస్తున్నారు. వైరల్ అవుతున్న దృశ్యాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు 63 మంది చనిపోగా.. పలువురు గల్లంతు అయ్యారు.ఎన్నో వాహనాలు కొట్టుకుపోయాయి. వందలాది పశువులు మరణించాయి. 14 వంతెనలు కొట్టుకుపోయాయి. రూ.400 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా. మరోవైపు అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఇక జూలై 7 వరకు అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *