సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృ ష్ణంరాజు సంస్మ రణ సభ కోసం భీమవరం కు సమీపంలోని ఆయన స్వ గ్రామం నేడు, గురువారం మొగల్తూరులో భారీ ఏర్పా టు చేసారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కృష్ణంరాజు వారసుడు అల్ ఇండియా పాన్ స్టార్ హీరో ప్రభాస్ ను భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్వయంగా కలసి రెబల్ స్టార్ కృష్ణంరాజు కు నివాళ్లు అర్పించి కృష్ణంరాజు మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, తరువాత బీజేపీ ఎంపీ గా ఉన్నపుడు తాను భీమవరం ఎమ్మెల్యే గా పనిచేసినప్పుడు ఆయనతో ఉన్న సాన్నిహిత్యం, సహకారం ప్రభాస్ కుటుంబంతో ఆనాటి జ్ణాపకాలు నెమరువేసుకొన్నారు. అందరికి స్వంత మనిషిగా అహానికి దూరంగా రారాజు లా బ్రతికిన, మన ప్రాంత అభివృద్ధికి కేంద్ర నిదులల్తో ఎంతో కృషి చేసిన కృష్ణంరాజు లేని లోటు పూడ్చలేనిది ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. మన ప్రాంత వాసి ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో భారతీయ నెంబర్ వన్ సినీ హీరోగా ఎదిగిన నేపథ్యంలో పెద్దనాన్న కృష్ణంరాజు కృషి, అస్సిసులు వెన్నంటే ఉన్నాయని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. హీరో ప్రభాస్ కూడా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *