సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ద‌స‌రా పండుగ స‌మ‌యంలో .. భారీ అంచనాలతో తొలిసారి సీనియర్ హీరో రవితేజ సినిమాలలో పాన్ ఇండియాగా విడుద‌లైన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమా అకస్మాత్తుగా ఓటిటి లో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. అక్టోబ‌ర్ 20న భ‌గ‌వంత్ సింగ్ కేస‌రి, లియో వంటి సినిమాల‌తో పోటీగా థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకొంది. స్టువ‌ర్టుపురానికి చెందిన గ‌రిక నాగేశ్వ‌ర‌రావు అనే గ‌జ దొంగ జీవిత క‌థ‌ ఆధారంగా ఫుల్‌యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ గా ప్రేక్ష‌కుడికి న‌చ్చే అన్ని అంశాల‌తో మంచి టేకింగ్ తో రూపొందించినప్ప‌టికీ సినిమా 3గంటల పైగా నిడివి, కథాగమనం తిక‌మ‌క‌ల వ‌ల్ల ప్రేక్ష‌కుల్లో క‌న్ప్యూజన్ ఏర్పడింది. ఈ సినిమాను నెల రోజుల‌ల లోపే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, త‌మిళ , క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ‌, హిందీ భాష‌ల్లోస్ట్రీమింగ్‌కు తెచ్చారు. ఇప్పుడు ఇంటిలోనే ప్రేక్షకులు వీక్షించవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *